హైదరాబాద్లో తీవ్రమైన నీటి కొరత కారణంగా పలు రెసిడెన్షియల్ కాలేజీలు దీపావళి సెలవులను ముందుగానే ప్రకటించాయి. ట్యాంకర్ల ద్వారా అందే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నాయి. హాస్టళ్లలో తాగునీరు, రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు వర్సిటీలు కూడా నీటి సరఫరా సమయాన్ని తగ్గించాయి.
హైదరాబాద్లో నీటి కొరత.. కాలేజీలకు ముందే దీపావళి సెలవులు

Source: TV9 Telugu — Education & Jobs


