శ్రీలంకతో జరగనున్న తొలి వన్డే మ్యాచ్ వేదికను బీసీసీఐ ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు మార్చింది. ఢిల్లీ స్టేడియంలో మరమ్మతులు, చలి, కాలుష్యం కారణాల వల్ల డిసెంబర్ 13న వైజాగ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ పర్యటన తర్వాత భారత్, శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడనుంది.