న్యూజిలాండ్ పర్యటనలో భారత-ఏ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 102 పరుగులతో వరుసగా రెండో శతకం సాధించాడు. మూడో అనధికార టెస్టు తొలి రోజు భారత్-ఏ 227/2 స్కోరు చేసింది. సాయి సుదర్శన్ 77, ధ్రువ్ జురెల్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల 70 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.