నిమ్మరసం రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. నిమ్మలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంతో పాటు డయాబెటిస్ నియంత్రణకు దోహదపడుతుంది.