ఆంధ్రప్రదేశ్ చీరాల పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. 10 వార్డుల్లో గెలుపొంది ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని మూడో స్థానానికి నెట్టింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రభావం ఈ ఫలితాల్లో కనిపించింది. మరోవైపు టిడిపి నేతృత్వంలోని కూటమి 25 స్థానాలు గెలుచుకుని చీరాల మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.