పరిషత్ ఎన్నికల ఫలితాల వేళ కూటమి మధ్య జడ్పీ చైర్మన్ పదవుల పంపకం పూర్తయినట్లు తెలుస్తోంది. మొత్తం 28 స్థానాల్లో జనసేనకు 5, బీజేపీకి ఒక పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జనసేనకు, కడప బీజేపీకి కేటాయించారని సమాచారం.