పికాక్స్ మౌంటెన్ అణు కేంద్రంపై అమెరికా దాడి ఊహాగానాల మధ్య ఇరాన్ అప్రమత్తమైంది. అణు దాడి జరిగితే ప్రాణాలు కాపాడుకోవడానికి ఇస్ఫహాన్ రెడ్ క్రెసెంట్ అధికారుల సూచనలతో ఇర్నా 8 నిమిషాల వీడియో విడుదల చేసింది. కిటికీలు మూసి, ఏసీలు ఆపి 24 గంటలు బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించింది.