అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సెనేట్ సహా కీలక స్థానాల్లో డెమొక్రాట్లు ఆధిక్యం ప్రదర్శించారు. రిపబ్లికన్ పార్టీ ఎదురుదెబ్బపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బ్యాలెట్‌పై తాను ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాళ్లమని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఓటమికి అభ్యర్థులే కారణమనేలా మాట్లాడటంతో ట్రంప్ శైలిపై ఆయన సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.