చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారెంట్‌తో నవంబర్ 2న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఆరోపణలను షాహిద్ ఖండించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2028 దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాల్సి ఉంది.