అణు దాడి లేదా విస్ఫోటనం సంభవిస్తే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఇరాన్ ప్రభుత్వం తమ పౌరులకు మార్గదర్శకాలు జారీ చేసింది. రేడియోధార్మిక ధూళి నుంచి రక్షణపై అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ 8 నిమిషాల వీడియోను విడుదల చేసింది. పాసివ్ డిఫెన్స్ వీక్‌లో భాగంగా ఇస్ఫాహన్ విభాగం ఈ సూచనలిచ్చింది.