తన పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. హకీంపేటలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తన జీవిత లక్ష్యమని, వారి ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.