పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉన్న గెడే రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే రైలు టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్‌లో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలు నిర్వహిస్తారు. ప్రస్తుతం బిఎస్‌ఎఫ్, కేంద్రీయ నిఘా సంస్థల నిఘాలో ఉన్న ఈ ప్రాంతంలోకి అనుమతి లేని సాధారణ ప్రయాణికులకు ప్రవేశం లేదు.