జగన్ ఒంటెత్తు పోకడలు, వైఖరి వల్లే స్థానిక ఎన్నికల్లో వైసీపీ దెబ్బతిందని ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనను మానసికంగా వేధించి బయటకు పంపారని, సస్పెండ్ చేసే ధైర్యం లేక చెప్పుడు మాటలు విన్నారని విమర్శించారు. త్వరలోనే మిగిలిన సీనియర్లు కూడా బయటకు వస్తారని పేర్కొన్నారు.