ఇటలీకి చెందిన మాటియో, కాటెరినా కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంపై ఇష్టంతో గతంలో హరిద్వార్, కాశీలను వారు సందర్శించారు. చివరకు తమ చిరకాల కోరిక మేరకు ప్రేమకు చిహ్నమైన ఆగ్రా నగరంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం టూర్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.