అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ 6 చోట్ల గెలవగా, టీడీపీ 3, సీపీఎం 1 స్థానాన్ని పొందాయి. గూడెంకొత్తవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు, డుంబ్రిగూడ, అనంతగిరిల్లో వైసీపీ గెలిచింది.