క్రికెటర్ శుభమన్ గిల్, పీవీ సింధు ‘టెంపుల్’ అనే హెల్త్ వేరబుల్ పరికరాన్ని పరీక్షిస్తున్నారు. జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ మద్దతుతో వచ్చిన దీనిని నుదిటి పక్కన ధరిస్తారు. ఇది మెదడు రక్త ప్రసరణ సంకేతాల ద్వారా మానసిక ఒత్తిడి, అలసట, రికవరీని అంచనా వేసి అథ్లెట్లకు శిక్షణలో తోడ్పడుతుంది.
గిల్, సింధు పరీక్షిస్తున్న కొత్త వేరబుల్ పరికరం ‘టెంపుల్’

Source: TV9 Telugu — Technology



