ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.1కే 24 రోజుల వ్యాలిడిటీతో ప్రత్యేక ప్లాన్ అందిస్తోంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి మారే కొత్త వినియోగదారులకు మాత్రమే నవంబర్ 9 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో రోజుకు 1GB డేటా, అపరిమిత ఉచిత కాల్స్, ఉచిత రోమింగ్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.