మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారన్‌హీట్ అందరికీ వర్తించదని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. గతంతో పోలిస్తే జీవక్రియల వేగం, ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం వల్ల ప్రజల సగటు ఉష్ణోగ్రత తగ్గుతోందని డాక్టర్ పార్సొనెట్ పేర్కొన్నారు. మెరుగైన వైద్యం, ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత కూడా ఇందుకు కారణమని పరిశోధకులు వివరించారు.