దీపావళి బాణసంచా పొగతో విడుదలయ్యే PM2.5, PM10 కణాలు, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. ఆస్తమా బాధితుల్లో దగ్గు, ఆయాసం పెరిగే ముప్పుంది. బాణసంచాకు దూరంగా ఉంటూ, తలుపులు మూసి, ఇన్హేలర్లు అందుబాటులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దీపావళి వేళ ఊపిరితిత్తుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Source: TV9 Telugu — Health


