ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 62 డివిజన్లలో టీడీపీకి 3 ఏకగ్రీవమవ్వగా, మిగిలిన 59 స్థానాలకు జరిగిన పోరులో మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ కేవలం 11 డివిజన్లు మాత్రమే గెలిచింది. ఇన్‌చార్జ్ చుండూరి రవి తీరు వల్లనే నాయకత్వ లోపం ఏర్పడి ఈ నష్టం జరిగిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.