ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అక్రమాలు జరిగాయని, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుని ఓటింగ్ శాతాన్ని కూడా మార్చేశారని ఆయన పేర్కొన్నారు.