ఏపీ మున్సిపల్ ఫలితాల్లో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. రామచంద్రపురంలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి సొంత వార్డులో వైసీపీ, వైసీపీ చైర్మన్ అభ్యర్థి సొంత వార్డులో టీడీపీ గెలిచాయి. నెల్లూరు ఆత్మకూరులో టికెట్ దక్కక స్వతంత్రులుగా పోటీ చేసిన జనసేన రెబెల్స్ గడ్డం సంధ్య, కొలగాని శిరీష విజయం సాధించారు.