ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో గెలిచిన మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 23న వీరంతా ప్రమాణం చేస్తారని ఎస్‌ఈసీ ప్రకటించింది. 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. డిప్యూటీ మేయర్ల ఎంపికపై త్వరలోనే స్పష్టత రానుంది.