విజయవాడ మేయర్‌గా గెలుపొందిన వంగవీటి రాధాకృష్ణ.. ఇది తన గెలుపు కాదు, ప్రజల విజయమని అన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఎంపీ కేశినేని చిన్ని, కూటమి నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.