ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 62.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నగరపాలక సంస్థల్లో ఒంగోలులో అత్యధికంగా 71.27 శాతం, తిరుపతిలో అత్యల్పంగా 46.85 శాతం పోలింగ్ నమోదైంది. విశాఖలో 56.32 శాతం ఓటింగ్ జరగ్గా, మున్సిపాలిటీల్లో చీమకుర్తి 84.36 శాతంతో టాప్‌లో, ఆదోని 53.6 శాతంతో చివరన నిలిచాయి.