ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ యథావిధిగా జరుగుతుందని ఎస్ఈసీ అనిల్ చంద్రపునేఠా తెలిపారు. అయితే తుపాను ప్రభావం ఉన్న గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో మాత్రం పోలింగ్‌ను వాయిదా వేసినట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు.