టీ సమయానికి బియ్యం పిండి, పుట్నాలతో కరకరలాడే మురుకులు చేసుకోవచ్చు. ముందుగా రెండు కప్పుల బియ్యం పిండిని వేయించి, మిక్సీ పట్టిన పుట్నాల పిండిని జల్లించి కలపాలి. అందులో ఉప్పు, కారం, వాము, నువ్వులు, ఇంగువ వేసి, రెండు కప్పుల వేడి నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి.