ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ విజయం ప్రజా తీర్పు కాదని, అధికార మదానికి నిదర్శనమని ఆరోపించారు. ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుని, ఓటు హక్కును కాలరాసి గెలిచారని షర్మిల విమర్శించారు. వైసీపీ నేతల ఆరోపణలకు ఆమె మద్దతు తెలిపారు.