మహీంద్రాకు పోటీగా టాటా మోటార్స్ సఫారీ ఈవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది యాక్టి.ఈవీ+ ప్లాట్‌ఫామ్‌పై 65kWh, 75kWh, 80kWh బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చే అవకాశం ఉంది. 75kWh వేరియంట్ ఒక్క ఛార్జ్‌తో 622 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని సమాచారం. ట్రిపుల్ స్క్రీన్, అడాస్ ఫీచర్లతో రానున్న దీని విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.