సెర్చ్ బార్‌లోని AI మోడ్ బటన్‌ను కొద్దిమంది యూజర్లకు గూగుల్ తొలగించినట్లు నివేదికలు తెలిపాయి. క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటోతో పాటు ఈ షార్ట్‌కట్ కనిపించడం లేదని లెన్ రాలీ పేర్కొన్నారు. సెర్చ్ ఇంజిన్ రౌండ్‌టేబుల్ కూడా దీనిని ప్రస్తావించింది. గూగుల్ దీనిపై ఏ/బీ టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.