న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 252 ఇన్నింగ్స్‌ల్లో 61.60 సగటుతో ఈ ఘనత సాధించి రికీ పాంటింగ్ రికార్డును దాటేశాడు.