న్యూజిలాండ్‌తో నవంబర్ 4 నుంచి 15 వరకు టీమిండియా ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆక్లాండ్, వెల్లింగ్టన్, హామిల్టన్, మౌంట్ మాంగనూయ్ వేదికల్లో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు టాస్ పడనుండగా, 7:30 గంటలకు ఆట ప్రారంభమవుతుంది. ఇప్పటికే భారత్ టీ20 సిరీస్‌ను 3-2తో నెగ్గింది.