న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత్ 3-2తో కైవసం చేసుకుంది. ఒక్కరోజే ప్రాక్టీస్ సమయం దొరికినా బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించారని కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను కొనియాడారు. ఇదే జోరును రాబోయే వన్డే, టెస్టుల్లోనూ కొనసాగించాలని ఆయన సూచించారు.