జనవరిలో మోదీ హౌరా-గువహతి మధ్య ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ రైలు ఇప్పుడు ఏపీకి చేరుతుంది. బెంగళూరు (SMVT) నుండి ముంబై (CSMT) వరకు 1,118 కిమీ, ప్రయాణ సమయం 20 గంటల నుంచి 16 గంటలకు తగ్గుతుంది. రైలు ధర్మవరం, అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో నిలుస్తుంది. బెంగళూరులో రాత్రి 7:50కి బయలుదేరి, తదుపరి రోజు ఉదయం 11:55కి ముంబై చేరుతుంది.