తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల స్కాలర్‌షిప్ అందిస్తోంది. దరఖాస్తుల గడువును అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాలామాయాదేవి పొడిగించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని పొందవచ్చు.