ఒప్పో సంస్థ AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఎంకో X4 ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. డైనాడియో ట్యూనింగ్, డ్యూయల్ డ్రైవర్లు, IP55 రేటింగ్ ఉన్న ఈ బడ్స్ గ్లేసియర్ వైట్, ఆరా వైలెట్ రంగుల్లో లభిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇవి 53 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని కంపెనీ పేర్కొంది.