కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరువు మండలాల రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా దొంతాపూర్‌లో ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు.