ఏపీలో అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తులను 60 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు కొత్త జీవో జారీ చేసింది. తహసీల్దార్, ఆర్డీవో స్థాయిల్లో ప్రక్రియ ముగించాలి. అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, వెబ్‌ల్యాండ్‌లో వెంటనే అప్‌డేట్ చేయాలని సీసీఎల్‌ఏను ప్రభుత్వం ఆదేశించింది.