కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ చేరుకుని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం చిరంజీవి, రాంచరణ్‌, రామేశ్వర్‌రావులతో భేటీ కానున్నారు. తర్వాత పార్టీ నేతలతో సమీక్ష ముగించి, నిజాం కళాశాల మైదానంలోని జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్రలో ఆయన పాల్గొంటారు.