తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసి, భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డయాలసిస్, ఏఆర్టీ, ఫైలేరియా బాధితుల భార్యలకు వర్తిస్తుంది. 57 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి వితంతు పింఛన్, 57 పైబడి ఉంటే వృద్ధాప్య పింఛన్ మంజూరు. దరఖాస్తు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో బిల్ కలెక్టర్‌కు అందించాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, భర్త ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
తెలంగాణ ప్రభుత్వం: భర్త మరణిస్తే భార్యకు తక్షణ పింఛన్
Archive image of Government of Telangana: Muzi at English Wikipedia / Wikimedia Commons (Public domain)
