ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా సీఎం అయ్యారని ప్రశ్నించారు. ఈవీఎంలు, ఎస్ఐఆర్ అంశాలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకైనా తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.