రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దాడికి 'యానిమల్' సినిమాను ముడిపెడుతూ సాగుతున్న చర్చపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. బాధితురాలి పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి సినిమాలపై బురద చల్లడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో నిందితుడికి పోలీసులు పట్టుకునే క్రమంలో బుల్లెట్ తగిలి కాలు తొలగించాల్సి వచ్చింది.