‘బాలు’ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ వెనుక ఎంతో ప్రణాళిక ఉందని రేణూ దేశాయ్ తెలిపారు. ఆ లుక్ కోసం విదేశాల్లో షాపింగ్ చేయడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం నాటి ఫ్యాబ్రిక్ కూడా వాడారని చెప్పారు. పవన్ ప్రారంభ సినిమాలకు స్టైలిస్ట్ గా వ్యవహరించిన ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలు పంచుకున్నారు.