బంగ్లాదేశ్‌లో కనీస వేతనాన్ని రూ.23 వేలకు పెంచాలని గార్మెంట్ కార్మికులు ఆదివారం ఢాకా, గాజీపూర్‌లలో రహదారులను దిగ్బంధించారు. నిరసనకారులు పోలీస్ ఔట్‌పోస్టుకు నిప్పుపెట్టారు. కొత్త వేతన బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, స్పష్టమైన హామీ కోరుతూ కార్మికులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం బలగాలను రంగంలోకి దించింది.