తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి ఏపీకి వస్తున్నారు. విజయవాడ చేరుకుని దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం, సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమవుతారు. ఈ భేటీలో గోదావరి-కావేరీ జలాల అనుసంధానం, కృష్ణా నది నీటి విడుదలపై చర్చించనున్నారు.