ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జనసేన, బీజేపీ అగ్రనేతలు అర్ధరాత్రి వరకు సమావేశమయ్యారు. విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం తదితర కార్పొరేషన్లు, 20కి పైగా మున్సిపాలిటీల్లో పోటీ చేయాలని జనసేన కోరుకుంటోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేసి కూటమిని గెలిపించేలా వారు ప్రణాళికలు సిద్ధం చేశారు.