ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలైంది. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు విడుదల చేసిన రిజర్వేషన్ల జీఓలు గత హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ న్యాయవాది వాదించారు. డెడికేషన్ కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నిబంధనలను పాటించకుండా రిజర్వేషన్లు అమలు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్
Archive image of Andhra Pradesh High Court: iMahesh / Wikimedia Commons (CC BY-SA 4.0)
