ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు వాదనలు ముగించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తుది తీర్పును రిజర్వ్ చేస్తూ కోర్టు ప్రకటించింది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.