రాప్తాడులో దాడికి గురై బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇవ్వకపోతే తమ ప్రభుత్వం వచ్చాక అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.