సెనెగల్‌లోని డాకర్‌లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో బెంగళూరుకు చెందిన 16 ఏళ్ల ధినిధి దేశింగు కాంస్య పతకం గెలిచింది. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌ను 56.27 సెకన్లలో పూర్తి చేసి, మూడో స్థానంతో జాతీయ రికార్డు నమోదు చేసింది. దీంతో యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది.